సాధారణంగా తమతో సన్నిహితంగా ఉంటూ తమపై ప్రేమ చూపించే మనుషులు అంటే చాలు జంతువులకు ఎంతో ప్రేమ ఉంటుంది. వారి మీద కాస్త మమకారం చూపిస్తే చాలు అవి చనిపోయే వరకు మనని వదిలిపెట్టే అవకాశం ఉండదు. ప్రస్తుత౦ ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అక్కడ కోట్లాది అడవి జంతువులను దహించి వేస్తుంది. ఎన్నో అరుదైన జాతులు ఆ మంటలకు కాల గర్భంలో కలిసిపోయాయి.
మరి కొన్ని గాయపడిన జంతువులను పలువురు కాపాడుతున్నారు. అక్కడి ప్రజలు ఎప్పటికప్పుడు వాటిని రక్షిస్తూ తమకు చేతనైన సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న అడవి జంతువులను మంటల నుంచి రక్షిస్తున్నారు. ఇలాగే ఒక వ్యక్తి మంటల్లో ఒక ఎలుగు బంటి పిల్లను రక్షించాడు. ఈ వీడియో ని సోషల్ మీడియాలో ఒక వ్యక్తి పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది.
15 సెకన్ల క్లిప్ ఒక ఎలుగుబంటి పిల్ల మనిషి వైపు పరుగెత్తుతూ కాళ్ళను కౌగిలించుకోవడం చూపిస్తుంది. అది పెంపుడు జంతువు మాదిరి అతన్ని వదిలిపెట్టలేదు. అతని కాలును విడిచిపెట్టడానికి నిరాకరించింది మరియు అతనిని వెంబడిస్తూనే ఉంది. “ఈ ఎలుగుబంటి, అగ్ని నుండి రక్షించబడింది, అతన్ని రక్షించిన వ్యక్తిని వదిలిపెట్టదు” అని శీర్షికతో వీడియో పోస్ట్ చేసారు. అయితే ఆ వీడియో ఆస్ట్రేలియాలో ఎక్కడా అనేది తెలియలేదు.
This bear, rescued from a fire, won't let go of the man who saved him. ? ? pic.twitter.com/lY3wpbpYfI
— julie marie cappiello Ⓥ (@jmcappiello) January 1, 2020