వైరల్ వీడియో; కూతురితో కలిసి ధోని ఏం చేస్తున్నాడో చూడండి…!

-

ప్రస్తుతం క్రికెట్ కి దూరంగా ఉన్న టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ధోని. శనివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో ఎంఎస్ ధోని, కుమార్తె జివాతో కలిసి హిల్ స్టేషన్‌లో స్నోమాన్ ని తయారు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసాడు. కూతురు సహాయంతో ధోని, 

స్నోమాన్ ని తయారు చేస్తున్నాడు. ఈ వీడియో ని భార్య సాక్షి రికార్డ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ నుండి విరామం తీసుకున్న తరువాత, టెరిటోరియల్ ఆర్మీ యొక్క పారాచూట్ రెజిమెంట్లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ అయిన ధోని, జమ్మూలోని 106 టిఎ బెటాలియన్ (పారా) లో రెండు వారాల పాటు చేరాడు. గత ఏడాది ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కి దూరంగా ఉన్న,

ధోని పై అనేక ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉందనే ప్రచారంతో పాటు బిజెపి ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అవుతాడనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. మార్చి తర్వాత ఆడబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ధోని తిరిగి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. అయితే ధోని కెరీర్ పై మాత్రం ఇప్పటి వరకు ఏ విధమైన స్పష్టతా ఇంకా రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version