వైరల్ వీడియో; ఫీల్డరే షాక్ అయిన క్యాచ్ ఇది…!

-

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లో మరో ఆసక్తికర క్యాచ్ నమోదు అయింది. ఊహించని విధంగా వచ్చిన బంతిని అందుకున్న ఫీల్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిడ్నీ థండర్ మరియు హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ జరిగింది. హోబర్ట్ ఫీల్డర్ నాథన్ ఎల్లిస్ ఉస్మాన్ ఖవాజా ఆడిన షాట్ ని అందుకున్న క్యాచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సిడ్నీ షోగ్రౌండ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ యొక్క 12 వ ఓవర్లో స్కాట్ బోలాండ్, షార్ట్ పిచ్ బాల్ వేసాడు. ఆ బంతిని సిక్స్ కొట్టాలని భావించిన ఖవాజా, డీప్ స్క్వేర్ లెగ్ వద్ద ఎల్లీస్ ఆ క్యాచ్ అందుకోవడానికి సిద్దంగా ఉన్నాడు. కాని ఆ బాల్ అతనికి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. కానీ బంతి అతను ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ ఎత్తులో వచ్చింది. దీనితో వెంటనే అప్రమత్తమై క్యాచ్ అందుకున్నాడు.

ఎల్లీస్ పొట్ట భాగంలో వస్తుందనుకునే క్యాచ్ తలపైకి రావడంతో క్యాచ్ అందుకుని వెనక్కు పడ్డాడు. ఆ తర్వాత ఆశ్చర్యపోతూ అతను వెనక్కు పడటం మనం వీడియోలో చూడవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సిడ్నీ థండర్స్ కెప్టెన్ కల్లమ్ ఫెర్గూసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, హోబర్ట్ హరికేన్స్ ను 162/6 కు తక్కువ పరిమితం చేశారు. హోబర్ట్ ఆటగాడు జార్జ్ బెయిలీ 30 బంతుల్లో 43 పరుగులు చేయగా, క్రిస్ మోరిస్, డేనియల్ సామ్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version