పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. 160 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా టార్గెట్ ను చేరుకుంది. మ్యాచ్ అధ్యంతం నరాలు తెగే ఉత్కంఠగా కొనసాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అయితే ఈ మ్యాచ్ విజయానికి అసలైన కారకుడు విరాట్ కోహ్లీ. 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను విజయతీరాలకు చేర్చి వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ. టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే. అలాగే టి20 ఇంటర్నేషనల్ లోనూ టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను దాటేశాడు. 2010 నుంచి 2022 మధ్య జరిగిన టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ ఏకంగా 3773 పరుగులు చేశాడు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఇలాంటి ఈవెంట్లో పాకిస్తాన్ పై అత్యధికంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను గెలుచుకుంది కూడా విరాట్ కోహ్లీ.
అంతేకాదు ఎక్కువ సార్లు క్లియర్ ఆఫ్ ద అవార్డు అందుకున్న వారిలో రెండో స్థానంలో ఉన్నాడు. టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో బెస్ట్ బ్యాటింగ్ ఆవరేజ్ ఫిగర్ కూడా కోహ్లీ పేరు మీదే ఉంది. టి20 మ్యాచ్ లో ఎక్కువ సార్లు 50కి పైగా పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీపేరుతోనే ఉంది. 35 సార్లు అతను టి20 ఇంటర్నేషనల్ లో 50 కి పైగా పరుగులు సాధించాడు. టార్గెట్ చేదించే క్రమంలో 18 సార్లు నాటౌట్ గా నిలిచి కోహ్లీ ఓ చరిత్ర సృష్టించాడు.