రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తే సిలిండర్ ధర 1200 నుండి 2400 అవుతుంది : కేటీఆర్‌

-

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. నేతలు తమ అభ్యర్థుల గెలుపుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అయితే.. నిన్న రాత్రి నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల్‌ మండలంలో మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. వృద్ధాప్య పెన్షన్, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, జ్యోతిబాపూలే స్కాలర్షిప్, ఇతర సంక్షేమ పథకాలు తెలంగాణ సమాజంలో చాలా మార్పులను తెచ్చాయి. దళితుల జీవితాల్లో వెలుగు నింపేందుకే దళిత బంధు తీసుకువచ్చాము…. ఇలాంటి పథకాలు మరెన్నో కేసీఆర్ మదిలో ఉన్నాయి.. 3000 రూపాయల పెన్షన్ ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో చెప్తున్న రాజగోపాల్ రెడ్డి బిజెపి పాలిత రాష్ట్రాలలో పెన్షన్ ఎంత ఇస్తున్నారో చెప్పాలి.

జన్ దన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్న మోడి మాటలు ఏమయ్యాయి.. రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తే సిలిండర్ ధర 1200 నుండి 2400 అవుతుంది.. ఎనిమిదేళ్ల కాలంలో ప్రజల ఆదాయం పెరగలేదు.. కేంద్ర ప్రభుత్వ ఆదాయం మాత్రమే పెరిగింది… చేనేత కార్మికులకు సబ్సిడీ త్వరగా అందేలా చర్యలు తీసుకుంటా…. చేనేత కార్మికులను అనే విధాలుగా ఆదుకుంటాం… కొత్తగా రెండు చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం… కుసుకుoట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే చండూరును రెవిన్యూ డివిజన్ చేస్తాం.. దేశం కోసం ధర్మం కోసం కాదు…. కాసుల కోసం కక్కుర్తి కోసం రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాడు అని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version