విశాఖ భూ అక్రమాలపై సిట్ కీలక ప్రకటన

-

విశాఖలో భూ అక్రమాలను నిగ్గు తేల్చే పనిలో పడిన ప్రభుత్వం ఒక ప్రత్యేక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఒక కీలక ప్రకటన చేసింది. భూ అక్రమాల గురించి ఈనెల 21,22 తేదీల్లో జిమెయిల్ ద్వారా ప్రజల నుంచి సూచనలు సలహాలను sit19suggest@gmail.com కి పంపాలని కోరింది. సిట్ -2019 పరిశీలిస్తున్న అంశాలైన ప్రభుత్వ భూమి మార్పు, వెబ్ ల్యాండ్ లో వివరాల మార్పులు చేర్పులు మీద అలానే మాజీ సైనికులు, రాజకీయ బాధితుల ఎన్వోసిల జారీకి సంబందించిన అంశాల మీద సూచనలు సలహాలను పంపాలని కోరింది.

ప్రభుత్వ భూములు అక్రమణలు,కబ్జాలు, ఎటువంటి నిర్ణీత విధి విధానాలను పాటించకుండా ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం వంటి వాటి మీద కూడా సూచనలు సలహాలను పంపాలని కోరింది. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడానికి పాల్పడిన అధికార్లను గుర్తించడం వంటి అంశాలను కూడా పంపాలని కోరింది. ఫిర్యాదులను, అభిప్రాయాలను తెలిపేందుకు మరో అవకాశం ఇస్తున్నామని పేర్కొంది. జిమెయిల్ ద్వారా పంపే సూచనలు, సలహాలు క్లుప్తంగా నిర్దేశించిన విషయ ప్రాధాన్యతగా ఉండాలని పేర్కొంది. 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version