జనసేన, బిజెపి ఉమ్మడిగా 2024 లో అధికారంలోకి రావడం ఖాయమని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వైసిపి నుండి వలసలు పెరగకుండా ఆపార్టీ నేతలు పొత్తుల ఎత్తులు వేస్తున్నారని.. ఎపి లొ మంత్రులు, ఎమ్మెల్యే లకు ఠంఛనుగా జీతాలు ఇస్తున్నారని వెల్లడించారు.
కష్టపడి పని చేసే సిబ్బంది, ఉద్యోగాలకు జీతాలు లేవని.. పవన్ కళ్యాణ్ పై కొంతమంది అనవసర వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
బిజెపి తప్ప… ఇతర పార్టీ ల పేరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ చెప్పారా ? నేను బిజెపి తో కలిసి ముందుకు సాగుతా అని పవన్ స్పష్టంగా చెప్పారు కదా ? అని నిలదీశారు.ఓట్ల చీలిక ఉండదంటే… ఆయన వ్యక్తిత్వం మీద మాట్లాడతారా ? సజ్జల, మంత్రులు పవన్, బిజెపి గురించి మాట్లాడుతున్నారంటే వారికి ఓటమి ఖాయమని అర్ధమైందని మండిపడ్డారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే… బిజెపి, జనసేన లకు ఓటు వేయమనే అర్ధమన్నారు. వైసిపి ని మన రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి తరమి కొట్టాలి.. రాష్ట్రం లో సింహాలను చూసి ప్రజలు భయపడుతున్నారు.. సింహాల గుంపు అడవిలొ ఉండాలి… మిమ్మలను తరిమాలనే ప్రజలు చూస్తున్నారని విమర్శించారు. మా పొత్తుల పై వైసిపి నాయకులే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు.. సజ్జల గారూ… మీ ప్రభుత్వం చేసిన మోసాలు అందరికీ అర్దమ అయ్యాయన్నారు.