ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు పట్టిన చీడ పురుగులు – విష్ణువర్ధన్ రెడ్డి

-

ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకు పట్టిన చీడ పురుగులు అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాకినాడ లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా తెనాలి లో బీజేపీ ప్రజాపోరు ప్రచార రథాన్ని తగలపెట్టారని.. అధికార పార్టీ నేతలు కి కొందరు పోలీసులు ఐపీసి ని వైసిపీ గా మార్చారని ఫైర్‌ అయ్యారు. డీ జీ పీ ఈ ఘటన పై విచారణ చేయాలన్నారు.

బీజేపీని నైతికంగా దెబ్బ తీయాలని చేస్తున్నారు.. పిరికిపంద చర్యలు తో ఏమి చేయలేరు.. బీజేపీ సభలు కు వస్తున్న వారికి సంక్షేమ పధకాలు ఆపేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. ఎవరు ఆనందంగా ఉన్నారని మీరు 175 సీట్లు గెలుస్తారని వైసీపీని నిలదీశారు. పోలవరం కి నిధులు ఇవ్వడం లేదనే దద్దమ్మలు, సన్నాసులు 70 శాతం అయిందని ఎలా చెప్తారని ఆగ్రహించారు. రైల్వే జోన్ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని… ఎన్టీఆర్ యూనివర్శిటీ కి పేరు మార్చాల్సిన అవసరం ఏంటి అని నిలదీశారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు టీ డీ పీ లేదు…. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరా సాగర్ పోలవరం పేర్లు టీ డీ పీ ఎందుకు మార్చిందని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version