కేసీఆర్‌పై ఈసీకు ఫిర్యాదు చేసిన విశ్వహిందూ పరిషత్ నేతలు

-

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సమీపిస్తున్న కొద్ది నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో నేతల మాటలు హద్దులను దాటుతున్నాయి.తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై విశ్వహిందూ పరిషత్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం సీఈవో వికాస్ రాజ్‌ను కలిసిన విశ్వహిందూ పరిషత్ నేతలు కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు.

దేవుడి పేరుతో అక్షంతలు ఆశచూపుతూ ఓట్లు వేయించుకుంటున్నారు అన్న వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రవర్తన నియామవళికి విరుద్ధంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేసీఆర్‌పై ఆంక్షలు విధించాలని వీహెచ్‌పీ నేతలు ఎన్నికల కమిషన్ ని కోరారు. కాగా, లోక్ సభ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉండగా కేసిఆర్ పై వీహెచ్‌పీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version