వీవో ఎక్స్ 80 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ సిరీస్ ఫోన్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ సిరీస్‌లో వివో ఎక్స్80, వివో ఎక్స్80 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే ఈ సిరీస్‌లో లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలో Vivo X80 Pro Plus కూడా చేరింది. ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. లీకుల ఆధారంగా ఫోన్ స్పెసిఫికేషన్, ధర ఇలా ఉన్నాయి.
వివో ఎక్స్80 ప్రో ప్లస్ వివరాలు..
జీఎస్ఎంఎరీనా కథనం ప్రకారం వివో ఎక్స్80 ప్రో ప్లస్ సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందని తెలుస్తోంది.
వివో ఎక్స్80, వివో ఎక్స్80 ప్రోల కంటే చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
వివో ఎక్స్80 సిరీస్‌లోనే మోస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌గా ఈ ఫోన్ నిలవనుంది.
వివో ఎక్స్80 ప్రో ధరను రూ.79,999గా నిర్ణయించారు.
12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది.
వివో ఎక్స్80 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో ఎక్స్80 ప్రో డిస్‌ప్లేనే ఉండనుంది.
6.8 అంగుళాల 2కే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
కెమెరా సామర్థ్యం..
వివో ఎక్స్80 ప్రో ప్లస్ సిరీస్‌లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న శాంసంగ్ జీఎన్1 సెన్సార్ ఉండనుంది. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్598 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా కూడా అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.