రాజాసింగ్ ను బిజెపి ఆయుధంగా వాడుకుంటుంది – ఉత్తమ్

-

రాజా సింగ్ ను బిజెపి ఆయుధంగా వాడుకుంటుందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి రాజాసింగ్ పై విచారణ చేయాలన్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణకు ఆదేశాలు ఇవ్వడం టిఆర్ఎస్ – బిజెపి ఆడుతున్న కొత్త డ్రామా అని వ్యాఖ్యానించారు. మునుగోడు గెలుపు కోసం సమిష్టిగా కృషి చేస్తామన్నారు ఉత్తమ్.

మునుగోడు అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు ఏఐసీసీ కి పంపామని.. దానిపై ఏఐసిసి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గులాం నబీ ఆజాద్ కు పార్టీతో 50 ఏళ్ల అనుభవం ఉందని.. కాంగ్రెస్ నుండి అత్యధిక లాభం పొందిన వ్యక్తి ఆయన అని చెప్పారు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొడగించలేదని అసంతృప్తితోనే ఆజాద్ మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. గాంధీ కుటుంబం పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version