బుల్లితెర టీవీ షోలు, సీరియల్స్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఆ గుర్తింపు ద్వారా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విన్నర్ గా సన్ని నిలిచాడు. ఇది ఇలా ఉంటే తాజాగా సన్నీ నటించిన సకలగుణాభిరామ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సన్నీ చేసిన కొన్ని కామెంట్స్ కు నెటిజన్లు మండిపడుతున్నారు. తెలుగు బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో గెలుస్తాడు అనుకుంటే డబ్బులు తీసుకుని బయటకు వచ్చేసావ్ అంటూ సోహైల్ గురించి సన్నీ చులకనగా మాట్లాడడు. బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో సోహెల్ గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, కానీ డబ్బులు తీసుకొని వీడు వచ్చేసాడు. నన్ను కూడా చాలామంది అలాగే అన్నారు. నీకన్నా పది లక్షలు ఎక్కువగానే పెట్టారు. అయినా కూడా నేను టెంప్ట్ కాలేదు.
కళావతి (సన్నీ తల్లి) కి కప్పు ముఖ్యం బిగిలూ.. అందుకే గెలిచి వచ్చా’ అని సన్నీ గర్వంగా చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ పై పరోక్షంగా అఖిల్ స్పందించాడు.. సన్నీ పేరును ఎక్కడ తియ్యకుండానే అఖిల్ మండిపడ్డాడు. ఎవరికైనా కార్యక్రమానికి పిలిసినప్పుడు వారిని గౌరవించాలి తప్ప అవమానించకూడదు. మనం హీరో అవ్వడం కోసం పక్కన వాళ్ళు జీరో చేయకూడదు బ్రదర్. నా స్నేహితుడిని అలాంటి పరిస్థితుల్లో స్టేజిపై చూడడం బాధగా అనిపించింది. ఆ సమయంలో నేనక్కడ ఉంటే బాగుండేది. అని అఖిల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కాసేపటికే అఖిల్ ఆ పోస్ట్ ను డిలీట్ చేశాడు.