గురువుల‌ను గుర్తు చేసుకున్న మోడీ

-

వ‌సంత పంచ‌మి వేళ‌లో రామానుజ విగ్ర‌హావిష్క‌ర‌ణ సంతోష‌క‌రం అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పేర్కొన్నారు. రామానుజాచార్య‌ల బోధ‌న‌లు ప్ర‌పంచానికి దారి చూపిస్తాయ‌ని, మ‌న సంస్కృతిలో గురువే జ్ఞానానికి కేంద్రం అని.. గురువుల‌ను గుర్తు చేసుకున్నారు ప్ర‌ధాని మోడీ. రామానుజాచార్యుల విగ్ర‌హం జ్ఞానం ధ్యానానికి ప్ర‌తీక అని పేర్కొన్నారు. శ్రీ‌రామ‌న‌గ‌రంలో 108 దివ్య‌దేశ మందిరాల ఏర్పాటు అద్భుతం అని ప్ర‌ధాని తెలిపారు. స‌మ‌తామూర్తి బోధ‌న‌లో వైరుధ్యం ఎప్పుడు రాలేదు అని, రామానుజాచార్యులు అంధ విశ్వాసాల‌ను పారదోలాల‌ని చెప్పారు.

దేశ‌మంతా తిరిగి ఆల‌యాలు చూసిన అనుభూతి క‌లిగింద‌ని ఆనందం వ్య‌క్తం చేసారు. చిన‌జీయ‌ర్ స్వామి త‌న‌తో విశ్వ‌క్రేనేష్టి య‌జ్ఞం చేయించారు అని, య‌జ్ఞ‌ఫ‌లం 130 కోట్ల ప్ర‌జ‌ల‌కు అందాల‌ని కోరారు ప్ర‌ధాని. దేశంలో ద్వైతం, అద్వైతం క‌లిసి ఉన్నాయ‌ని, రామానుజాచార్యుల విశిష‌ద్వైత్వం మ‌న‌కు ప్రేర‌ణ అని పేర్కొన్నారు. మ‌నిషికి జాతి కాదు.. గుణం ముఖ్యం అని లోకానికి చాటి చెప్పిన మ‌హానీయుడు రామానుజాచార్యులు అని తెలిపారు. ముఖ్యంగా స‌మ‌తామూర్తి దళితుల‌ను ఆల‌య ప్ర‌వేశం చేయించార‌ని ప్ర‌ధాని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version