VT12 నుంచి బిగ్‌ అప్డేట్‌..మెగా ఫ్యాన్స్‌ కు పూనకాలే

-

రోటీన్‌ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కెరీర్ బిగినింగ్ నుండే విభిన్న జానర్ లో సినిమాలను చేస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. వరుణ్ కి ఈ ఏడాది ‘గని’తో అంతగా శుభారంభం దక్కకపోయినా, ఎఫ్-3 తో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు.

ప్రస్తుతం ఈయన రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ఒకటి. ఇటీవలే ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ‘ది గోస్ట్’ విడుదలై ప్లాప్ గా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ క్రమంలో వరుణ్ తో ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే #VT12 పేరుతో తెరకెక్కుతున్న వరుణ్‌ తేజ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ ను ఈ నెల 19న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version