లైగర్ నుంచి బిగ్ అప్టేట్..”వాట్ లగా దేంగే” అంటూ విజయ్ రచ్చ

-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాథ్, నటి చార్మి, కరణ్ జోహార్ కలిసి పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవర కొండ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు.అయితే ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌ సినిమా పై భారీగా అంచనాలు పెంచేసింది.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి వాట్‌ లగా దేంగే అంటూ సాగే గ్లింప్స్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో విజయ్‌ దేవరకొండ నోట వాట్‌ లగా దేంగే అంటూ ఓ డైలాగ్‌ వస్తుంది. ఆ డైలాగే, ఈ వీడియోకు హైలెట్‌ గా నిలిచింది. ఈ వీడియో అందరీని బాగా ఆకట్టుకుంటోంది. కాగా.. విజయ్‌ నటించిన ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version