పాత గూగుల్ అకౌంట్ ని డిలేట్ చెయ్యాలనుకుంటున్నారా..? అయితే ఇలా పర్మినెంట్ గా డిలీట్ చేసేయచ్చు..!

-

మామూలుగా మన పేరు మీద ఒకటి కంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ ఉంటూనే ఉంటాయి. ఒక జీమెయిల్ క్రియేట్ చేయడం.. తర్వాత దానిని వదిలేసి కొత్త ఐడి క్రియేట్ చేయడం చాలామంది చేస్తూ ఉంటారు. పాత జీమెయిల్ ఐడిని వాడకుండా వదిలేసే వాళ్లు కూడా ఉంటారు. అయితే వారి యొక్క గూగుల్ అకౌంట్ యాక్టివ్ గా ఉంటుంది.

 

Google

ఆ మెయిల్ ఐడి తో కనుక హ్యాకర్లు లాగిన్ అయ్యారంటే సమస్యలు తప్పవు. అందుకని ఎప్పుడూ కూడా ఉపయోగించని పాత జీమెయిల్ తాలూక గూగుల్ అకౌంట్ ని డిలీట్ చేయడం మంచిది. ఫేస్బుక్ మొదలైన ఇతర ప్లాట్ఫామ్స్ లాగానే గూగుల్ కూడా యూజర్లు తమ అకౌంట్ ని డిలీట్ చేసే అవకాశం ఇస్తోంది. దీనిలో సులభంగా పర్మినెంట్ గా మీరు అకౌంట్ ని డిలీట్ చేసుకోవచ్చు.

మీరు కనుక పర్మినెంట్ గా గూగుల్ అకౌంట్ ని డిలీట్ చేయాలంటే.. మొదటి https://www.google.com/account/about/ లింక్ ని ఓపెన్ చేయండి.
తర్వాత మీ గూగుల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
హోం పేజీలో డేటా ప్రైవసీ ఆప్షన్ కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేయండి.
ఇప్పుడు మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి.
డిలీట్ యువర్ గూగుల్ ఎకౌంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత డిలీట్ అకౌంట్ అప్డేట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
డిలీట్ చేయడానికి మరోసారి మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
గూగుల్ అకౌంట్ డిలీట్ చేస్తే గూగుల్ సేవలు ఏవి యాక్సెస్ చేయలేరని మెసేజ్ వస్తుంది.
మీ గూగుల్ అకౌంట్ లో ఉన్న డేటాను డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ యువర్ డేటా ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
తర్వాత రెండు బాక్స్ల ని కూడా టిక్ చేయండి.
డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి.
అంతే మీ అకౌంట్ డిలీట్ అవుతుంది.
డిలీట్ చేసే ముందు ముఖ్యమైన డేటాని డౌన్లోడ్ చేసుకుంటే డేటా ఎంత భద్రంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version