వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

-

వ్యాపారం చేయాలంటే.. పెట్టుబడి ఎంత ముఖ్యమో.. ప్లానింగ్‌ కూడా అంతే ముఖ్యం. ఏ వ్యాపారం చేయడానికికైనా కొన్ని పాయింట్స్‌ను బాగా ఫాలో అవ్వాలి. ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అంటే.. దాని ముందు ఎంతో ఆలోచించి ఉంటారు. ఆ నిర్ణయం వల్ల మీ లైఫ్‌ ఎటుపోతుందో కూడా తెలియదు. ముందు మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే..మీకు కావాల్సింది ఓపిక. పెట్టిన నెలరోజుల్లోనే లాభాలు వచ్చేయాలి అని మైండ్‌సెట్‌లో ఉండకూడదు. అన్నప్రాసన రోజే ఆవకాయ తినలేం కదా..! ఇదీ అంతే.. బిజినెస్‌ స్టాట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవే.

ఎలాంటి వ్యాపారం చేయాలలో చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఏ పని చేసినా అది లాభదాయకంగా ఉండాలి. అంతేకాదు మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వ్యాపారం మాత్రమే చేయాలి. తెలియని దాంట్లోకి అడుగుపెట్టి.. డబ్బును నష్టపోవద్దు.

మార్కెట్‌లో పోటీ ఎలా ఉంటుందో వ్యాపారవేత్తలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా యువ వ్యాపారులు తమ ఉత్పత్తులపై మాత్రమే డబ్బు, సమయాన్ని వెచ్చిస్తారు. పోటీదారులపై తక్కువ పరిశోధన చేస్తారు. కానీ పోటీదారుల కంటే భిన్నంగా ఆలోచించి.. లోతైన మార్కెట్ పరిశోధన చేస్తే.. నష్టాలు రావు

ప్రతి వ్యాపారవేత్తకు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలి. వ్యాపార ప్రణాళిక అనేది వ్యాపారాన్ని ప్రారంభించడానికి మాత్రమే కాదు.. నిధులు, వృద్ధికి కూడా హెల్ప్‌ అవుతుంది.

స్కేలబుల్ బిజినెస్ మాడల్‌ను ఎంచుకోవాలి. భవిష్యత్తులో వ్యాపారం పెరిగేకొద్దీ అదనపు పెట్టుబడి లేకుండానే ఎక్కువ మంది కస్టమర్ల అవసరాలను తీర్చగలిగే వ్యాపారాన్ని చేయాలి. మీ బిజినెస్ మాడల్ బాగుంటే.. నిధులకు ఎలాంటి ఇబ్బందులు రావు. అప్పుడే మంచి లాభాలు వస్తాయి.

మీ బిజినెస్ స్ట్రక్చర్‌ కూడా కీలకమైనది. మీరు లిమిటడ్ లయబిలిటీ కంపెనీ (LLC), లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (LLP), సోల్ ప్రొప్రేటర్, కార్పొరేట్‌లో ఏదైనా వ్యాపార నిర్మాణాన్ని ఎంచుకోవచ్చు. అది ఏదైనా గానీ.. పక్కా ప్రణాళికతోనే బిజినెస్‌లోకి దిగాలి. ఈ పాయింట్స్‌ అన్నీ మైండ్‌లో పెట్టుకుని దీనికి తగ్గట్టు ప్లానింగ్‌ చేసుకుని అప్పుడు స్టెప్‌ తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version