భారత్లో ఈ ఏడాది మరోసారి ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల పోలింగ్, ఫలితాల తేదీలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది నవంబర్ 7, 17వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
ఛత్తీస్గఢ్ ఎన్నికల షెడ్యూల్
తొలి విడత పోలింగ్ తేదీ : నవంబర్ 7
రెండో విడత పోలింగ్ తేదీ : నవంబర్ 17
ఫలితాల తేదీ: డిసెంబర్ 3
మొత్తం ఓటర్లు: 2.03 కోట్లు
2018 ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (90 సీట్లు)
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – 68
భారతీయ జనతా పార్టీ – 15
జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ – 5
బహుజన్ సమాజ్ పార్టీ – 2
ఛత్తీస్గఢ్లో 2018లో కాంగ్రెస్ పార్టీ ఘటన విజయం సాధించింది. ప్రస్తుత భూపేశ్ బఘేల్ ప్రభుత్వం 2024 జనవరి 3 వరకు కొనసాగనుంది. అయితే గత 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎట్టకేలకు సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ తాపత్రయపడుతోంటే.. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మరి ఈ ఇరువురిలో విజయం ఎవరిదో తేలాలంటే మరో రెండు నెలలు వేచి చూడాల్సిందే.