కార్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి..!

-

ఇదే కొత్త కారుని కొనడానికి సరైన సమయం. ఎందుకంటే రుణాలపై వడ్డీ రేట్లు ఆల్​టైమ్​ కనిష్ఠానికి చేరాయి. దీనికి తోడు పండగ సీజన్ కారణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గాయి. బ్యాంకులు కారు లోన్లను కూడా చాలా సరళతరం చేశాయి. అయితే ఎవరైనా ఈఎంఐతో కార్లు కొనుగోలు చెయ్యాలని భావిస్తే వీటిని తప్పక చూడాలి. ఇక మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే చూద్దాం.

 

రుణ అర్హత సామర్థ్యం ని కారు కొనాలనుకుంటున్నవారు ముందుగా చూసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ లో అయితే లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ బ్యాంక్ వెబ్ సైటులో కాలుక్యులేటర్ పై రుణ అర్హత చూడచ్చు. అలానే ఏ బ్యాంక్ ఎంత వడ్డీకి లోన్ ఇస్తోందో చూసుకోండి. అదే విధంగా ఎంత లోన్ తీసుకోవాలో ముందే నిర్ణయించుకోవాలి.

ఎందుకంటే కారు ధర కన్నా బడ్జెట్ ఎక్కువ ఉండ కూడదు. రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమా ప్రీమియం, కారు ఎసెసొరీస్ అన్నీ బడ్జెట్లోనే లెక్కించుకోవాలి. డౌన్ పేమెంటు ఏమీ లేకుండానే కారు మొత్తం లోన్ లో వస్తుందని ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ పెంచుకోవద్దు. ఈఎంఐ పెరిగిపోతే ఇతర అవసరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అందుకని బడ్జెట్ ని మాత్రం అస్సలు దాటొద్దు. అలానే ఎంత కాలానికి రుణం తీసుకోవాలనేది చూడాలి. ఒకవేళ ఐదు సంవత్సరాల కాల పరిమితికి తీసుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. అయితే వడ్డీ రూపంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. మీ యొక్క ఖర్చులు మొదలైనవి లెక్కించి కాల పరిమితిని ఎంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version