ఈజీగా హోమ్ లోన్ పొందాలనుకుంటున్నారా? అయితే ఇలా చెయ్యాల్సిందే..!!

-

సొంత ఇల్లు కట్టాలని అనుకుంటున్నారా? లేదా ఇల్లు కొనాలని అనుకుంటున్నారా..? అందుకోసం హోమ్ లోన్ తీసుకోవాలని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారా?అయినప్పటికీ రుణం పొందలేకపోతున్నారా? అయితే, మీకోసమే ఈ వార్త. సాధారణంగానే హోమ్ ప్రకటనలకే సులువు. కానీ, ఆ లోన్ పొందాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే.. దాని ప్రాసెస్ అంతలా ఉంటుంది మరి. అయితే, ఇప్పుడు మనం హోమ్ లోన్ ఈజీగా ఎలా పొందాలో తెలుసుకుందాం. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా హోమ్ లోన్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

 

గృహ రుణ ఆమోదం పొందడానికి మీ క్రెడిట్ స్కోర్‌ను నిర్వహించండి. క్రెడిట్ స్కోర్ మీరు రుణాన్ని, క్రెడిట్ డబ్బును తిరిగి చెల్లించడానికి ఎంత సిద్ధంగా ఉన్నారో తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ మీ లోన్స్, మీరు లోన్ ఈఎంఐ చెల్లిస్తున్న తీరు సహా అన్ని వివరాలను అందిస్తుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే వెంటనే గృహ రుణం లభిస్తుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవచ్చు. సకాలంలో చెల్లింపు చేయడం ద్వారా క్రెడిట్ స్కోర్‌ను ఈజీగా పెంచుకోవచ్చు.అంటే క్రెడిట్ కార్డు ను పరిమితి వరకే వాడాలి..

బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ఈ విషయంలో పోటీని కలిగి ఉన్నాయి. చాలా స్పీడ్‌గా రుణాలను అందజేస్తాయి. చాలా వరకు బ్యాంకులు క్రెడిట్ స్కోర్, ఆదాయం మొదలైనవాటిని త్వరగా తనిఖీ చేసే వ్యవస్థను కలిగి ఉంటాయి. అటువంటి పైనాన్స్ కంపెనీలు, బ్యాంకుల నుండి తక్షణ రుణాన్ని పొందే అవకాశం ఉంది.. ప్రీ-అప్రూవ్డ్ లోన్ పొందడం కూడా ఒక మార్గంగా చెప్పవచ్చు..క్రెడిట్ స్కొర్ బాగుంటే లోన్ త్వరగా అప్రూవల్ అవుతుంది.రుణం తీసుకోనే ముందు బ్యాంకుల వడ్డీ రేట్లను ఒకసారి చూడాలి..

త్వరగా రుణం పొందేందుకు డాక్యూమెంట్లన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. లోన్ కోసం అప్లై చేసే ముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను రెడీగా ఉంచుకోవాలి. బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లినప్పుడు.. మీ వద్ద ఎలాంటి పేపర్స్ లేకపోతే నెగిటేవ్ ప్రభావం చూపుతుంది..అందుకే క్రెడిట్ స్కొర్ తో పాటు, సంభంధిత పత్రాలను.అందుబాటులో ఉంచుకోవాలి.బ్యాంకు అధికారులు లోన్ కోసం కాల్ చేసినప్పుడు, క్రెడిట్ స్కోర్ ఎంత అనేది మొదటి ప్రశ్న వస్తుంది. అలాగే, ఆదాయం, అప్పు, అన్ని వివరాలను దగ్గర ఉంచుకోవాలి.అన్నీ కరెక్ట్ గా ఉంటే మాత్రం హోమ్ లోన్ త్వరగా వస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version