టీడీపీని బెదిరించాలని అనుకుంటున్నారా?: నారా లోకేశ్

-

చిత్తూరు జిల్లా మాజీ మేయర్ హేమలతపై పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలోని పోలీసులు రోజురోజుకు దిగజారిపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఎప్పటికీ వదలమని అన్నారు.

నారా లోకేశ్

శుక్రవారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో నారాలోకేశ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు తమ భుజాలపై తుపాలకు పెట్టుకుని టీడీపీని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులపై కేసులు పెట్టి బెదిరించడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. పోలీస్ వ్యవస్థ గాడి తప్పిందని, అందుకే చిత్తూర్ జిల్లాలో మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షులను బెదిరించి.. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసు శాఖ స్పందించాలన్నారు. ఇది ఇలాగే కొనసాగితే చర్యకు ప్రతిచర్య ఉంటుందని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నారా లోకేశ్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version