జనవరి 26 నేపధ్యంలో భారత్ లో ఉగ్రదాదులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీలో ఉగ్రవాద కార్యాకలాపాలు వేగంగా జరుగుతున్నాయని, గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఆ రోజున దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబై, దక్షిణాదిన కీలక నగరంగా ఉన్న హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై,
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, బీహార్ రాజధాని పాట్నాల్లో బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందినట్టు తెలుస్తుంది. దీనితో తీర, వాయి, రోడ్డు మార్గాల్లో భద్రతను పటిష్టం చేయాలని పలు రాష్ట్రాలకు సూచించినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో ఈ నెల 20 నుంచి 30 వరకు సందర్శకులు ఎవరూ విమానాశ్రాయలకు రావొద్దని కేంద్రం ఆదేశించింది.
ప్రయాణికులు అందరూ విమానాశ్రయాలకు త్వరగా వెళ్ళిపోవాలని చెప్పడంతో పాటుగా జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వొద్దని చెప్పింది. జమ్మూ, కాశ్మీర్ సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్ములో ఉగ్రవాద దాడులు పెరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారం నేపధ్యంలో ఆర్మీ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేసారు.