అపెండిసైటిస్ అనేది అపెండిక్స్ లో వాపు లేదా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. అపెండిక్స్ అనేది పెద్ద పేగుకు ఆనుకొని ఉన్న చిన్న గొట్టం వంటి అవయవం. ఇది కడుపు కుడి దిగువ భాగంలో ఉంటుంది. అపెండిసైటిస్ సాధారణంగా అకస్మాత్తుగా సంభవిస్తుంది లేదా శరీరం దీనిని ముందుగా కొన్ని సంకేతాలను ఇస్తుంది ఈ లక్షణాలను సకాలంలో గుర్తించడం వల్ల తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు.. మరి ఈ సమస్య లక్షణాలను వివరంగా తెలుసుకుందాం..
కడుపునొప్పి : అపెండిసైటిస్ యొక్క అతి సాధారణ లక్షణం కడుపునొప్పి. ఈ నొప్పి సాధారణంగా కడుపు మధ్య భాగం లేదా బొడ్డు చుట్టూ మొదలై క్రమంగా కుడి దిగువ భాగంలోకి చేరుతుంది. మొదట్లో తేలికపాటి నొప్పిగా మొదలై కొద్దిగా తీవ్రమవుతుంది..
ఆకలి తగ్గడం: అపెండిసైటిస్ ఉన్నవారు సాధారణంగా ఆకలిని కోల్పోతారు. ఆహారం తినాలని ఆసక్తి లేకపోవడం సాధారణంగా ఇష్టపడే ఆహారం కూడ తినడానికి ఇష్టపడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

వికారం,వాంతులు : ఈ సమస్యతో బాధపడేవారు తరచూ వికారంగా అనిపిస్తుంది. వాంతులు, విరోచనాలు కలుగుతాయి. కడుపులో అసౌకర్యం అనిపించడం ఒకటి లేదా రెండు సార్లు వాంతులు కావడం ముఖ్యంగా ఆహారం తీసుకున్న వెంటనే ఇలా జరుగుతుంది.
జీర్ణ సమస్యలు: ఈ సమస్య ఉన్నవారు జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది మలబద్ధకం విరోచనాలు రూపంలో కనిపిస్తుంది. కడుపులో గ్యాస్ లేదా ఉబ్బరంగా కూడా అనిపించవచ్చు. కడుపుకుడి దిగువ భాగంలో నొక్కినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
అపెండిసైటిస్ ను పూర్తిగా నివారించడం కష్టమైనప్పటికీ కొన్ని జాగ్రత్తలు దీని ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పండ్లు కూరలు తృణధాన్యాలు వంటి పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం. ఆహారం తయారీలో తినేటప్పుడు శుభ్రత పాటించడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గుతుంది. శరీరానికి తగినంత నీరు తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ముఖ్యంగా కడుపుకుడి దిగువ భాగంలో తీవ్రమైన నొప్పి, జ్వరం, వాంతులు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ముఖ్యం. సాధారణ లక్షణాలను గుర్తించి వెంటనే చికిత్స తీసుకుంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.
(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం.)