ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. ఇక ముఖ్యంగా మాచర్లలో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ కి చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ఈవీఎం ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ చేపట్టగా.. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై తాజాగా ఎన్నికల సంఘం అతని పై సీరియస్ అయింది. అతనికి ఏడు ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఈసీ తెలిపింది. ఈ ఘటనపై వైసీపీ నేత సజ్జల స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఒక్కటే లీకైందా..? అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఆ వీడియో సరైనదేనా? కాదా అని కూడా చూడకుండా ఈసీ చర్యలు తీసుకోవడం ఏంటని నిలదీశారు. పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతోంది. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని వీడియోలు బయటపెట్టాలి. అప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది అని ఆయన డిమాండ్ చేశారు.