చలువ చేసే సింగాడాలు.. ఎప్పుడైనా చూశారా..?

-

సింగాడాలు ఈ పేరు చాలా తక్కువ మంది విని ఉంటారు. అసలు వీటిని చూసి కూడా ఉండరేమో కదా..! హైలెట్‌ ఏంటంటే..మీరు చూసే ఉంటారు కానీ.. అవి ఇవే అని తెలియక వాటి జోలికి వెళ్లి ఉండకపోవచ్చు. ఇవో రకం నీటి దుంపలు. ఇంగ్లీష్‌లో వీటిని వాటర్‌ చెస్ట్‌నట్‌ అంటారు..సింగాడాలు నీటిలో దొరికే దుంపలు. తాజాగా ఉన్నప్పుడు ఇవి పచ్చగా, ఎర్రగా ఉంటాయి. వీటిని పచ్చిగా కూడా తింటారు. ఉడికించినవి ఇంకా రుచిగా ఉంటాయి. అవే మనం మార్కెట్లో చూసే నల్లని సింగాడాలు. పైకి దుంప నల్లగా ఉన్నా… కోసి చూస్తే లోపల తెల్లగా ఉంటుంది. వీటి ఆకృతి కారణంగా వీటిని బ్యాట్‌ నట్‌, బుల్‌నట్‌ అని కూడా అంటారు. ఉత్తరాదిన ఈ దుంపల్ని మర పట్టించి ఆ పిండితో రుచికరమైన వంటకాలు కూడా చేస్తుంటారు. వీటి వల్ల ఆరోగ్యపరమైన లాభాలు ఏంటో చూద్దాం!

వీటికి సంతాన సామర్థ్యాన్ని పెంచే శక్తి ఉందట. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

అధిక రక్తపోటుతో బాధపడేవాళ్లు ఈ దుంపల్ని ఆహారంలో చేర్చుకుంటే మేలు జరుగుతుంది.

కెలొరీలు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండటంతో.. బరువు తగ్గాలనుకొనే వారికి మంచి ఆహారం.

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారం కాబట్టి వీటితో చేసిన రొట్టెలని ఉపవాసాలప్పుడు తింటే శక్తిని పుంజుకుంటారని చెబుతోంది సెలబ్రిటీ చెఫ్‌ రుజుతా దివేకర్‌.

ఇది కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగిస్తుంది. ఈ కారణంగా, కడుపు నొప్పి, అపానవాయువు, ముడి బెల్చింగ్ సమస్యలు వంటి కడుపు సమస్యలు ఉన్న వారు వీటిని తినవచ్చు.

ఈ సారి రోడ్డుపై కనిపిస్తే.. తప్పకుండా వీటిని తీసుకోండి. మార్కెట్‌లో దొరికే చాలా పండ్లు గురించి తెలియక ఎప్పుడూ తినే ఆ నాలుగు ఐదు రకాలే తింటూ ఉంటాం..

Read more RELATED
Recommended to you

Exit mobile version