తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ తర్వాత వరుసగా రెండు ఎన్నికలలో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజల కల సాకారం అయ్యే విధంగా పరిపాలన అందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తాగు మరియు సాగు నీటి కష్టాలను తీర్చే విధంగా కేసీఆర్ తనదైన శైలిలో తీసుకున్న నిర్ణయాలకు దేశంలోనే మహామహులకు పులకరించే విధంగా మారాయి. మేటర్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో కనీసం నీళ్లు కనిపించే ప్రాంతాలు కూడా చాలా తక్కువ. అటువంటి తెలంగాణ ప్రాంతంలో కాలేశ్వరం ప్రాజెక్టు చేపట్టి యుద్ధప్రాతిపదికన కెసిఆర్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు.
గోదావరి నీటితో కళకళలాడుతున్న కాలేశ్వరం ప్రాజెక్టు చూసి ఫిదా అయ్యారు. కెసిఆర్ పనితనాన్ని మరియు ప్రాజెక్టు పరిధిలో మేడిగడ్డ ఆనకట్ట.. లక్ష్మీ పంప్ హౌస్.. ఎత్తి పోతల పనులను పరిశీలించి ఇంజనీర్లను పొగిడారు. అయితే ఇంకా ఈ ప్రాజెక్టు పనులు గురించి తెలుసుకోవడానికి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సుపరిచితుడైన రాజేందర్ సింగ్ కెసిఆర్ ని కలవటానికి ప్రగతి భవన్ కి రాబోతున్నాడని సమాచారం.