కర్ణాటక లో నీటి కష్టాలు.. ఒక బిందె ఎంతంటే..?

-

వర్షా కాలంలో తక్కువ వర్షపాతం నమోదు అవ్వడంతో వేసవి ప్రారంభం కాకముందే కర్ణాటకలో నీటి కష్టాలు మొదలైపోయాయి. చెరువులు కుంటలు పూర్తిగా ఎండిపోవడం వలన పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి తీవ్ర ఇబ్బంది మొదలైంది.ఈ క్రమంలో బిందెనీళ్లకి 25 వసూలు చేస్తున్నప్పటికీ కొనుక్కుని తాగడానికి కూడా నీళ్లు లభించట్లేదు ముఖ్యంగా బెంగళూరులో అయితే మంచినీటి సమస్య ఎక్కువగా ఉంది చెరువులు పూర్తిగా ఎండిపోయాయి దీంతో దాదాపు 7వేలకి పైగా భూగర్భ బోరు బావులు అడుగంటిపోయినట్లు తెలుస్తోంది దీంతో రంగంలోకి దిగిన కర్ణాటక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది.

ప్రజలకి తక్షణం తాగునీటిని అందించడానికి టాంకర్ లని రంగంలోకి దించింది కాలనీలో గ్రామాల్లోని ప్రజలకి ట్యాంకర్ల ద్వారా నీటిని ఇస్తున్నారు. వేసవి ప్రారంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే మరో నెల రోజులు తర్వాత కర్ణాటక ఎడారిలా మారిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద సంస్థలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలవడంతో నీటి మీద ఆధారపడి ఉన్న కంపెనీలు ఫ్యాక్టరీలు మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version