ఇంటి పని చేయాలని భార్యను కోరడం క్రూరత్వం కాదు: దిల్లీ హైకోర్టు

-

భార్యను ఇంటి పనులు చేయాలని భర్త కోరడం క్రూరత్వం కాదని దిల్లీ హైకోర్టు పేర్కొంది. బాధ్యతలను పంచుకోవడమే మ్యారిడ్ లైఫ్ అని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులను విడిచి భార్యతో ఉండలేనని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటి పని చేయమని అడగటంతో భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఓ వ్యక్తి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను విడిచి వేరు కాపురం పెట్టాలని వేధిస్తోందని, వారిని విడిచి ఉండలేనంటూ విడాకులు కోరాడు. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం విడాకులు మంజూరుకు నిరాకరించడంతో ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దానిపై విచారించిన న్యాయస్థానం వివాహితను ఇంటి పనులు చేయమని భర్త కోరడం తప్పు కాదంటూ సమర్థిస్తూ స్త్రీ తన కుటుంబానికి చేసే సేవను ఆప్యాయతగా పరిగణించింది. అది సాయంతో సమానం కాదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version