ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితులపై ఓ విద్యార్థి తండ్రి ఏకంగా ఎమ్మెల్యే ముందే అధికారులను నిలదీశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నట్లు సమాచారం. వైరా ఎమ్మెల్యే రాందాస్ మాలోతు హాజరైన ఓ కార్యక్రమంలో విద్యార్థి తండ్రి మాట్లాడారు. ‘ప్రభుత్వ పాఠశాలలో భోజనం బాగా లేదని ఎమ్మెల్యే ముందే ప్రశ్నించారు.
ప్రభుత్వ హాస్టళ్లకు మెస్ బిల్లులు పెంచిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పిల్లలకు పెట్టే భోజనం బాగాలేదంటూ వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాందాస్ మాలోత్‌ను విద్యార్థిని తండ్రి నిలదీశాడు.ఎమ్మెల్యే వచ్చారని ఈరోజే చికెన్, మినరల్ వాటర్ పెట్టారు.కానీ, ఇంతక ముందు ఎప్పడు పెట్టలేదు. ఇక్కడ నీళ్ల సమస్య, నీళ్ల సాంబార్ తప్ప ఏమీ లేదు. మీరు ఉన్నారని ఆర్భాటం తప్ప ఇక్కడ ఏమీ లేదు’ అని అధికారుల అలసత్వాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు పాఠశాల విద్యార్థినులు సైతం మద్దతు పలికారు.
ప్రభుత్వ పాఠశాలలో భోజనం బాగా
లేదుఎమ్మెల్యే ముందే నిలదీసిన
తండ్రిప్రభుత్వ హాస్టళ్లకు మెస్ బిల్లులు పెంచిన
నేపథ్యంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పిల్లలకు పెట్టే బోజం
బాగాలేదంటూ వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాందాస్ మాలోత్‌ను నిలదీసిన
విద్యార్థిని తండ్రిఎమ్మెల్యే వచ్చారని… pic.twitter.com/Al8WGz1YX6
—
Telugu Scribe (@TeluguScribe) December
14, 2024