టమాటాలు, ఉల్లిపాయలు, సరిపడా మసాలాలు వేసి ఎగ్ కర్రీ చేస్తే.. వావ్ ఇట్స్ డెలీషియస్ అనని వాళ్లు ఎవ్వరూ ఉండరు. ఎగ్ కర్రీ తయారు చేయడం చాలా ఈజీ. కానీ టేస్టీగా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకూడదు. సాధారణంగా ఇలాంటి తప్పులు చేయడం వల్లే ఎగ్ కర్రీ టేస్ట్ లేకుండా తయారవుతుంది.
ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం.
చల్లని నీళ్లతో వండడం:
ఏ కూర వండడానికైనా మరీ చల్లగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. చల్లగా ఉన్న నీళ్లలో మసాలాలు సరిగ్గా ఉడకవు. ఈ కారణంగా ఎగ్ కర్రీ టేస్ట్ పోతుంది. అందుకే మామూలుగా ఉన్న నీళ్లను వంటలకు వాడాలి.
పాత మసాలా దినుసులు:
మసాలాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకోవాలి. వాటితోనే కూరలు వండాలి. కొంతమంది ఇలాంటి విషయంలో చాలా తప్పులు చేస్తారు. ఎన్నో రోజుల పాత మసాలాలను ఉపయోగిస్తారు. ఎగ్ కర్రీ టేస్టీగా ఉండాలంటే కొత్త మసాలా దినుసులు వాడాలి.
గుడ్లను సరిగ్గా ఉడకబెట్టకపోవడం:
సాధారణంగా బ్యాచిలర్ రూమ్లో ఇలాగే జరుగుతుంది. ఆకలి అవుతున్నప్పుడు అన్నం కూర వండటం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడెప్పుడు అవుతుందా అని మాటిమాటికి మూత తెరిచి చూస్తుంటారు. ఒక్కోసారి సరిగా ఉడక్కపోయినా తినేస్తారు. గుడ్డు సరిగ్గా ఉడక్కపోతే కూర రుచిగా ఉండదు.
మసాలాలు సరిగా వేగకపోవడం:
ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వంటి మసాలా దినుసులు సరిగ్గా నూనెలో వేగకపోవడం వల్ల ఎగ్ కర్రీ టేస్టీగా ఉండదు. కచ్చితంగా మసాలా దినుసులను బాగా ఉడకనివ్వాలి.