మహిళల బిగ్ బాష్ లీగ్ టైటిల్ ను దక్కించుకున్న స్ట్రైకర్స్ !

-

గత ఒకటైన నెల రోజులుగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ కు ఈ రోజుతో శుభం కార్డు పడింది. మొత్తం ఎనిమిది టీం లు హోరాహోరీగా తలపడగా చివరికి అడిలైడ్ స్ట్రైకర్స్ మరియు బ్రిస్బేన్ హీట్ జట్లు మాత్రమే ఫైనల్ కు అర్హత సాధించాయి. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన అడిలైడ్ కెప్టెన్ మెక్ గ్రాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అంతరం ఈ జట్టు నిర్ణీత ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. హీట్ బౌలింగ్ లో హాంకక్ మూడు వికెట్లతో ఆకట్టుకుంది, ఇక గెలుపు ఖచ్చితంగా బ్రిస్బేన్ హీట్ దే అనుకున్నారు. కానీ అడిలైడ్ బౌలింగ్ లో అద్భుతంగా ప్రదర్శన చేసి బిస్బేను 122 పరుగులకు పరిమితం చేసి మూడు పరుగుల తేడాతో మ్యాచ్ ను గెలుచుకుని షాకిచ్చింది.

బౌలింగ్ లో అమండా మూడు వికెట్లు తీసుకోగా, షూట్ రెండు వికెట్లు తీసుకుంది. ఇక గత సంవత్సరం సైతం అడిలైడ్ ట్రోఫీని గెలుచుకోగా ఇప్పుడు కూడా స్ట్రైకర్స్ గెలుచుకుని గర్వంగా కప్ ను ముద్దాడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version