హైదరాబాద్ కు చెందిన తెలుగు క్రికెట్ ప్లేయర్ తిలక్ వర్మ ఐపీఎల్ లో అంది వచ్చిన అవకాశంతో ముంబై తరపున ఆడుతూ తనదైన శైలిలో చెలరేగి ఆడుతుండడంతో, జాతీయ సెలెక్టర్ల కన్నుల్లో పడ్డాడు. దీనితో తిలక్ వర్మకు అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం చాలా తక్కువ వయసులోనే దక్కింది. కానీ మొదట్లో చాలా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు చేసే తిలక్ వర్మ, ఆ తర్వాత కాస్త నెమ్మదించాడు. నిలకడగా పరుగులు చేయడంలో బాగా వెనుకబడ్డాడు. ప్రస్తుతం ఇండియా జట్టులో చాలా పోటీ ఉండగా ఈ విధమైన ప్రదర్శన ఆశించినదగినది కాదు. ఉదాహరణకు ఆస్ట్రేలియా తో జరుగుతున్న సిరీస్ లో మొదటి మూడు మ్యాచ్ లలో అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మ పెద్దగా ఆడింది లేదు, అందుకే నిన్న జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మకు అవకాశం కల్పించలేదు.
అతనికి బదులుగా జట్టులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా పరుగులు చేయకపోయినా సీనియర్ బ్యాట్స్మన్ గా అతనికి ఎక్కువ ఛాన్సెస్ దక్కుతాయి. ఇలాగే ఆడితే ముందు ముందు ఇండియా జట్టులో చోటు దక్కడం కష్టమే.