ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం జిల్లాలోని తంబళ్లపల్లి అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుపై కొంతమంది విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
గతంలో మాదిరి స్వేఛ్చగా తమను బయటకు పంపివ్వడం లేదని కొత్తగా వచ్చిన సెక్యూరిటీ గార్డుపై ఓ గ్యాంగ్గా ఏర్పడి వచ్చి దాడి చేసినట్లు సమాచారం. విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, గాయాలపాలైన సెక్యూరిటీ గార్డును స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.