హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తాము చెట్లను నరకలేదని, జంతువులు చనిపోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం ఇంకా చెట్లను పెంచుతుందని, జంతువులను కాపాడుతుందని వెల్లడించారు.
మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. అడవి కాని దాన్ని అడవి అంటూ తప్పుగా చూపిస్తున్నారని ప్రతిపక్షాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావని.. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ముమ్మాటికీ ప్రభుత్వానివే అని ఆయన స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు సైతం ఉన్నారు.