గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చైతన్యపరిలో గల వైల్డ్ హార్ట్ పబ్ మీద పోలీసులు దాడులు నిర్వహించారు. అందులో యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
వారి కథనం ప్రకారం.. సమయానికి మించి యజమాన్యం పబ్ నడుపుతున్నట్లు సైతం ఫిర్యాదులు వచ్చాయని.. కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ముంబైకి చెందిన యువతను రప్పించి అభ్యంతరకర నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించామన్నారు.నిన్న సాయంత్రం యువతులతో అర్ధ నగ్న నృత్యాలు చేయిస్తుండగా.. పోలీసులు ఒక్కసారిగా దాడులు నిర్వహించి 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. అనంతరం పల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.