ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకు తెలియదన్నారు ఏపీ హోం మంత్రి తానేటి వనిత. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్ష నేత చెప్పేవరకు తెలియదని.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవేనా అంటూ మండిపడ్డారు. ఈ మూడేళ్లు రాష్ట్రంలో జగన్ పాలన పై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వాలలో కంటే సంతోషంగా ఉన్నామని ధైర్యంగా చెబుతున్నారని.. కరోనా సమయంలో టిడిపి నేతలు ఎక్కడున్నారో వారికే తెలియదు అన్నారు.
ఇప్పుడేమో జనాన్ని ఉద్ధరించేస్తామని తయారయ్యారని వనిత ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ను పిల్లలందరూ మేనమామ గా భావిస్తున్నారన్నారు మంత్రి. చదువుకునే సమయంలోనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్ మీడియం అని.. ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదన వచ్చిన దగ్గర్నుంచి వ్యతిరేకించిన ప్రతిపక్షాలను చూశామన్నారు. వాళ్ల పిల్లలు మాత్రం విదేశాల్లో ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం చదివించు కోవచ్చా.. పేదలు మాత్రం ఇంగ్లీష్ చదువులు చదువుకో కూడదని వారి రూల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.