మరి కొన్ని నెలల్లో ఏపీ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి చెప్తే ప్రత్యర్థి పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని ముఖ్యమంత్రి జగన్ ఎద్దేవా చేశారు. ‘ప్రతి నియోజకవర్గంలో 87 శాతం ఇళ్లకు పథకాలు అందాయి అని తెలిపారు. కుప్పంలో 93శాతం ఇళ్లకు మంచి చేశాం అని, 87వేల ఇళ్లు ఉంటే 83 వేల ఇళ్లకు మంచి జరిగింది అని పేర్కొన్నారు. 57 నెలల్లో ఎన్నడూ జరగనంత మంచి జరిగింది. ఊహకు కూడా అందని రీతిలో విప్లవాత్మక పరిపాలన చేశాం అని స్పష్టం చేశారు. లంచం, వివక్ష లేకుండా అందరికీ పథకాలు అందాయి’ అని వెల్లడించారు.
నవరత్న పథకాలు, పరిపాలన ద్వారా తాను ప్రజలకు చేయాల్సిందంతా చేశానని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ఇకపై మీరు చేసే పనులపైనే మీ గెలుపు ఆధారపడి ఉంది. ఈసారి నాకు 175కు 175 అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీలు సీట్లు రావాల్సిందే అని అన్నారు. ఆ దిశగానే అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లండి’ అని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు.