మా ప్రాణాలు తీశాకే పేదల ఇళ్లను కూల్చాలి : బండి సంజయ్

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలు, మూసీ పరివాహక ప్రాంతం పరిధిలోని నిర్మాణాలను హైడ్రా నిర్దాక్షిణంగా కూల్చివేస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు పేదల పక్షాల పోరాడేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా బీజేపీ సైతం మూసీ పరివాహక ప్రాంతంలోని నిరాశ్రయులకు అండగా ఉంటామని హామీనిచ్చింది. ఎప్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలను కూలుస్తామని ముందే ప్రకటించిన హైడ్రా ఆ దిశగా ముందుకు సాగుతోంది.

హైడ్రా చర్యలపై తాజాగా బీజేపీ కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. గతంలో అయ్యప్ప సొసైటీ పేరు మీద బీఆర్ఎస్ వసూళ్లకు పాల్పడితే ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు పాల్పడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. హైడ్రా తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పేదల ఇళ్లను కూల్చాలనుకుంటే హైడ్రాను బీజేపీ అడ్డుకుంటుందని అన్నారు. తమ ప్రాణాలు తీశాకే కూల్చివేతలకు వెళ్లాలని బండి సంజయ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ అంశంలో తాము ఒంటరిగానే పోరాటం చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version