యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ నేతలు జరిపిన దాడి గురించి నల్లగొండ జిల్లా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. మీరు చేసినట్లు మేం చేస్తే కాంగ్రెస్ నామరూపాల్లేకుండా అయ్యేదని అన్నారు. కానీ, కేసీఆర్ ఎప్పుడూ మాకు అలాంటివి చేయాలని ఎంకరేజ్ చేయలేదని వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారికి పోలీసులు సహాయం చేయడాన్ని మాజీ మంత్రి తప్పుబట్టారు. నిందితులను పోలీసులు కారులో తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరననలు చేపడతామని హెచ్చరించారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గులాబీ పార్టీ ఆఫీసుపై దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.