భారత్‌లో కొత్త ఆటగాళ్లకు సరైన ప్రోత్సాహం లభించడం లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. ఇవాళ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడా పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తుందన్నారు. ఈ వాలీబాల్ పోటీలు మూడు రోజుల జరుగుతాయి.
ఇందులో ముఖ్యంగా ఉమ్మడి పది జిల్లాలకు చెందిన మహిళలు, పురుషులకు సంబంధించి పదిజట్లు బరిలోకి దిగుతాయి. విన్నర్లకు ట్రోపీలతో పాటు క్యాష్ అవార్డులను అందించనున్నట్టు తెలంగాణ జాగృతి ప్రతినిధులు ప్రకటించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను అభివృద్ధి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వేళలా క్రీడాకారులకు అందుబాటులో ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.