IRCTC అదిరే టూర్ ప్యాకేజీ.. విస్టాడోమ్ రైలులో టూర్…!

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం వేర్వేరు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందులో భాగంగా విస్టాడోమ్ రైల్ టూర్ ప్యాకేజీని కొత్తగా తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ టూర్ లో అద్దాల రైలు నుంచి హిమాలయాల అందాలను చూడచ్చు. అద్భుతమైన పర్యాటక ప్రాంతం దువార్స్ చూడాలనుకునేవారికి ఈ ప్యాకేజీ బాగుంటుంది. ఈ టూర్ లో ఝలోంగ్ బిందు, మూర్తీ రివర్, చప్రమరి వైల్డ్ ఫారెస్ట్ లాంటి ప్రాంతాలు చూడచ్చు. ఐఆర్‌సీటీసీ విస్టాడోమ్ రైల్ టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ టూర్ న్యూ జల్పాయ్‌గురి రైల్వే స్టేషన్ దగ్గర మొదలు అవుతుంది. న్యూ జల్పాయ్‌గురి నుంచి విస్టాడోమ్ రైల్ టూర్ వెళ్ళాలి. ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఇక ధర విషయంలోకి వస్తే..విస్టాడోమ్ రైల్ టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,580 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,780. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.10,140 చెల్లించాలి. శుక్రవారం ఉదయం పర్యాటకులు న్యూజల్పాయ్‌గురి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి.

అక్కడ ఉదయం 7.20 గంటలకు విస్టాడోమ్ రైలు ఎక్కాల్సి ఉంటుంది. దారిలో ప్రకృతి అందాలను చూడచ్చు. ఉదయం 9.10 గంటలకు న్యూ మల్ జంక్షన్ చేరుకుంటారు. అక్కడ నుండి పర్యాటకుల్ని ఐఆర్‌సీటీసీ సిబ్బంది హోటల్‌కు తీసుకెళ్తారు.

రెండో రోజు ఉదయం చప్రమరి వైల్డ్ ఫారెస్ట్ ని చూడచ్చు. సాయంత్రం న్యూ మల్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. టూరిస్టులు సాయంత్రం 5 గంటలకు విస్టాడోమ్ రైలు ఎక్కాలి. ఈ రైలు సాయంత్రం 7 గంటలకు న్యూ జల్పాయ్‌గురి రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version