మహిళలకు ఏటా 1,00,000 రూపాయలు ఇస్తాం : రాహుల్ గాంధీ

-

దేశ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు.మహిళలకు ఏటా రూ. లక్ష నేరుగా బ్యాంకులో వేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ హామీ ఇచ్చారు. ‘యువతకు ఏడాదికి రూ.లక్ష వచ్చేలా ఉపాధి కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.తుక్కుగూడలో జరుగుతున్న జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… విద్యావంతులైన యువకులకు సంవత్సరం పాటు నెలకు రూ.8,500 ఇస్తూ, శిక్షణ ఇప్పిస్తాం అని తెలిపారు.

ఇకపై దేశంలో ఏ కుటుంబానికి ఏటా రూ.లక్ష ఆదాయం కంటే తక్కువ ఉండదు అని అన్నారు. మోడీ ప్రభుత్వం ధనవంతులకే రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేసింది అని ,రైతులకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు’ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version