ఏపీలో స్టేడియాలను ఆధునీకరిస్తాం.. గ్రామీణ పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

-

రాష్ట్రంలోని స్టేడియాలను ఆధునీకరిస్తాం.. గ్రామీణ పేద క్రీడాకారులను ప్రోత్సహిస్తాం అని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.కడప జిల్లా పులివెందులలో ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా హాకీ ఆంధ్రప్రదేశ్ పోటీ నిర్వహించడం సంతోషించదగ్గ విషయం అని అన్నారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా ఈ పోటీలను నిర్వహిస్తున్న హాకీ ఆంధ్రప్రదేశ్ అధికారులను ఆయన అభినందించారు.. ఇక, రాష్ట్రంలో ఉన్న స్టేడియాలను ఆధునిరించి మంచి శిక్షణ ఇచ్చేలా తీర్చిదిద్దుతాం అని తెలిపారు.

గత ప్రభుత్వంలో క్రీడా శాఖ ఒకటి ఉంది అన్నది కూడా ప్రజలు మర్చిపోయారని .. ఐదు సంవత్సరాల చివరి పాలన కాలంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఒక ఈవెంట్ మాత్రమే నిర్వహించారు అని మండిపడ్డారు.ఆడుదాం ఆంధ్రకు 130 కోట్ల రూపాయలు ఖర్చు చేసి క్రీడాకారుల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. క్రీడాకారుల జీవితాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకొని 130 కోట్లు ఖర్చు చేశారు.. క్రీడాకారుల కోసం కాకుండా కేవలం వైసీపీ నాయకుల ప్రచారం కోసం వాడుకున్నారని అన్నారు.

క్రీడాకారుల సొమ్ము వాడుకున్న వారి నుంచి కక్కిచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నామని తెలిపారు. .కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పేద గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం… పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల ద్వారా శాప్ ద్వారా క్రీడా పోటీల నిర్వహిస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version