జగన్ దోచుకున్న డబ్బు మొత్తం రీకవరి చేస్తాం : అచ్చెన్నాయుడు

-

ఆంధ్రప్రదేశ్ లో రాబోయేది తమ ప్రభుత్వమేనని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జోన్ సమావేశాన్ని కాకినాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ. రాష్ట్రం పేరు చెప్పి ఇప్పటివరకు సీఎం జగన్ రూ.13లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రతీ వారం కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకొచ్చారని చెప్పారు. అప్పు తెచ్చిన డబ్బులు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కి తరలించారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

రూ.60వేల కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపారని మండిపడ్డారు. సీఎం వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ దోచుకున్న డబ్బు మొత్తం రీకవరి చేస్తామని హెచ్చరించారు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని 5 కోట్ల ఆంధ్రులు చీదరించుకుంటున్నారని.. అచ్చెన్నాయుడు ఆరోపించారు. మరోవైపు ఇసుకపై రూ.40వేల కోట్లు దోచుకున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగలేదన్నారు. రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమయంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు అచ్చెన్నాయుడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version