కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని తీసివేస్తాం: పొన్నాల లక్ష్మయ్య

-

కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కొమరవెల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు టీపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ధాన్యం కల్లాల వద్ద రైతులు మరణిస్తుంటే.. కెసిఆర్ మాత్రం పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేయడానికి వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని తీసేస్తామని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.

వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులు పండించే పంటకు మద్దతు ధర కల్పించడం తోపాటు కౌలు రైతులకు రుణమాఫీ అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని పార్టీ జిల్లా అధ్యక్షుడు తుంకుట నర్సారెడ్డి పేర్కొన్నారు. గతంలో మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని, కానీ సీఎం కేసీఆర్ మేనిఫెస్టో లో చేసిన వాగ్దానాలు ఎంతవరకు అమలయ్యాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version