ఇలాంటి ప్రభుత్వాలకు లాలూ భయపడరు; తేజస్వి యాదవ్

-

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవలే బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. దాణా కుంభకోణం కేసులో అరెస్టయి మూడేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన లాలూ బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఆయన విడుదలైన కొద్దిరోజులకే లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల పై సిబిఐ తాజాగా మరో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలను ఇప్పించి వారి నుంచి భూములు, ఆస్తుల రూపంలో లంచాలు తీసుకున్నారని సిబిఐ అభియోగాలు మోపింది.

ఈ క్రమంలో నిన్న లాలూ కి చెందిన పలు చోట్ల సిబిఐ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆర్జేడి నేత, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వాలకు లాలూ భయపడని, వెన్ను చూపరని అన్నారు. సత్య మార్గంలో పయనించడం చాలా కష్టమని.. అయినా అసాధ్యం కాదని చెప్పారు. కాస్త ఆలస్యం అయినా చివరకు నిజమే గెలుస్తుంది అని అన్నారు. ఈ పోరాటంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version