తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ్టి నుంచి తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నటి ఉత్తర – దక్షిణ ద్రోణి ఈ రోజు కూడా దక్షిణ ఛత్తీస్ గడ్ నుండి తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
నిన్న రాయలసీమ & పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం ఈ రోజు తమిళనాడు కోస్తా తీరం & పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వద్ద కొనసాగుంది.
దీని కారణంగా రాగల మూడు రోజులలో తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఈ రోజు మరియు ఎల్లుండి తెలంగాణా రాష్ట్రంలో భారీ వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.