ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది. మరో రెండు నెలల పాటు భగ భగ మండే ఎండలు కొట్టనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువగా కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో… మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
నిన్న ఏపీలో చాలా జిల్లాల్లో వర్షాలు కురిసాయి. శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో ఈ జిల్లాల్లో పంటలన్ని నేలకొరిగాయి. ఇక మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉండటంతో.. రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే.. అటు మాములు ప్రజలు మాత్రం వర్షాలు పడితే.. మంచిదని చెబుతున్నారు. ఉక్కపోతకు తాము ఇబ్బందులు పడుతున్నామని.. వర్షం పడితే… కాస్త ఉప సమనం కలుగుతుందని అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.