బంగాళ ఖాతం లో వాయు గుండం తీరం దాటిందని… ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల మధ్య పుదుచ్చేరి – చెన్నై సమీపంలో తీరం దాటిందని పేర్కొంది. తెల్లవారుజామున 3-4గంటల తీరం దాటింది వాయుగుండం. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా వర్షాలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ.
అంతేకాదు… అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని… మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే సహాయ చర్యలకు చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు NDRF, SDRF బృందాలు చేరుకున్నాయి. అలాగే… లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఇక తిరుమలలో ఇవాళ, రేపు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. దర్శనాలు కూడా రద్దు అయ్యాయి.