చలి..చంపేస్తోంది.. గజగజ వణుకుతున్న జనాలు..

-

రోజు రోజుకు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో చలికి వణికిపోతున్నారు ఏజన్సీ ప్రజలు. కొమురం భీం జిల్లా లో 7.3, ఆదిలాబాద్ జిల్లాలో 8.3,
నిర్మల్ జిల్లా లో 9.2, గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైతం చలి తీవ్రత పెరిగిపోతోంది. సంగారెడ్డి జిల్లా సత్వార్ లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మెదక్ జిల్లా లింగాయి పల్లిలో 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతేకాకుండా.. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో చాలా చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైంది.

అయితే నిన్న సాయంత్రం అయిందంటే చాలు చలి పెరుగుతూ రాత్రి వరకు ఎక్కువై జనాన్ని గజగజవణికిస్తోంది. ఉదయం కూడా పొద్దెక్కే వరకు చలి వదలడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. వచ్చే ఒకటి, రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.8 డిగ్రీల సెల్షియస్‌ నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16.1 డిగ్రీల సెల్షియస్‌ మధ్య నమోదవుతాయని పేర్కొంది. ఇక ఆదిలాబాద్‌ జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రత బాగా పడిపోయింది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10.7 డిగ్రీల సెల్షియ్‌సగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ జిల్లాలో గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల సెల్సియస్‌ తగ్గినట్లు పేర్కొంది. ఇక ఖమ్మం జిల్లాల్లో ఎండ పెరిగింది. ఆ జిల్లాల్లో క్రమేపి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్‌ మేరకు పెరిగినట్లు తెలిపింది. ఈ జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.6 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ మేరకు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version